Friday, 25 December 2015

రండి సువార్త సునాదముతో

    రండి సువార్త సునాదముతో
    రంజిలు సిలువ నినాదముతో
    తంబుర సితార నాదముతో
    ప్రభు యేసు దయానిధి సన్నిధికి

1    యేసే మానవ జాతి వికాసం
    యేసే మానవనీతి విలాసం
    యేసే పతిత పావన నామం
    భాసుర క్రైస్తవ శుభనామం        ||రండి||

2    యేసే దేవుని ప్రేమ స్వరూపం
    యేసే సర్వేశ్వర ప్రతిరూపం
    యేసే ప్రజాపతి పరమేశం
    ఆశ్రిత జనముల సుఖవాసం   ||రండి||

3    యేసే సిలువను మోసిన దైవం
    యేసే ఆత్మల శాశ్వత జీవం
    యేసే క్షమాపణ అధికారం
    దాసుల ప్రార్థన సహకారం        ||రండి||

4    యేసే సంఘములో మన కాంతి
    యేసే హృదయములో ఘనశాంతి
    యేసే కుటుంబ జీవన జ్యోతి
    పసి పాపల దీవెన మూర్తి        ||రండి||

5    యేసే జీవన ముక్తికి మార్గం
    యేసే భక్తుల భూతల స్వర్గం
    యేసే ప్రపంచ శాంతికి సూత్రం
    వాసిగ నమ్మిన జనస్తోత్రం        ||రండి||

No comments:

Post a Comment