Friday, 25 December 2015

స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ

    స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ
    సత్యముతో నాత్మతో నెపుడు
    పరిశుద్ధాలంకారములతో 
    దర్శించెదము శరణం శరణం    ||స్తో||

1.    ధవళ వర్ణుడ - రత్న వర్ణుడ 
    సత్యరూపి యనబడువాడ
    నను రక్షించిన రక్షకుండ
    నాథ నీకె శరణం శరణం         ||స్తో||

2.    శ్రేష్టయీవుల నిచ్చినందున 
    శ్రేష్ట యీవుల ఊట నీవె
    త్రిత్వమై యేకత్వమైన త్రి 
    యేకదేవా శరణం శరణం        ||స్తో||

3.    పాపి మిత్రుడ పాప నాశుడ 
    పరమ వాసుడ ప్రేమ పూర్ణుడ
    వ్యోమపీఠుడ స్వర్గ పూజ్యుడ 
    పరిశుద్ధాంగుడ శరణం శరణం   ||స్తో||

4.    సంఘమునకు శిరస్సు నీవె
    రాజ నీకె నమస్కారములు
    ముఖ్యముగను మూలరాయి
    కోట్ల కొలది శరణం శరణం      ||స్తో||

5.    నీదు సేవకుల పునాదిది
    జ్ఞానమునకు మించిన తెలివి
    అందముగను కూడుకొనుచు 
    వేడెదము శరణం శరణం          ||స్తో||

6.    రాజ నీకె స్తుతి స్తోత్రములు
    గీతముల మంగళ ధ్వనులు
    శుభము శుభము శుభము నిత్యము 
    హల్లెలూయ ఆమెన్‌ ఆమెన్‌      ||స్తో||

No comments:

Post a Comment