Friday, 25 December 2015

వందనం బొనర్తుమో ప్రభో - ప్రభో

    వందనం బొనర్తుమో ప్రభో - ప్రభో 
    వందనం బొనర్తుమో ప్రభో - ప్రభో 
    వందనంబు తండ్రి తనయ, శుద్ధాత్ముడా
    వందనంబు లందుకో ప్రభో

1.    ఇన్నినాళ్ళు ధరను మమ్ము బ్రోచియు 
    గన్న తండ్రి మించి యెపుడు గాచియు
    ఎన్నలేని దీవెన-లిడు నన్న యేసువా
    యన్ని రెట్లు స్తోత్రము లివిగో    ||వం||

2.    ప్రాత వత్సరంపు బాప మంతయు
    బ్రీతిని మన్నించి మమ్ము గావుము
    నూతనాబ్దమునను నీదు నీతి నొసగు 
    మా-దాత క్రీస్తు నాథ రక్షకా||వం||

3.    దేవమాదుకాలు సేతు లెల్లను    
    సేవకాళి తనువు దినములన్నియు
    నీ వొసంగు వెండి,పసిడి-జ్ఞానమంత నీ 
    సేవకై యంగీకరించుమా         ||వం||

No comments:

Post a Comment