యెహోవా మా తండ్రి గాఁడ
యేసుఁడు మా యన్న గాఁడ
మహిమ గల శుద్ధాత్మ యిట్టి
వరుస దెలిపెంగద మా తోడ
1 మోక్ష నగరు మా పుట్టిల్లు
ముఖ్య దూతల్ మా స్నేహితులు
సాక్షాత్కారమైయున్నపుడు
లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహో||
2 అబ్రాహాము దావీదు మొదలైనట్టి
వర భక్తాగ్రేసరులే
శుభ్రముగ మా చుట్టా లైనన్
హర్షిమిఁక మా కేమి కొదువ ||యెహో||
3 పేతురాది సకలాపోస్తుల్
పేర్మిగల మా నిజ కూటస్థుల్
ఖ్యాతి సభలో మేమున్నప్పుడు
ఘనతలిక మాకేమి వెలితి ||యెహో||
4 తనువు బలిపెట్టెను మా యన్న
తప్పు ల్విడఁగొట్టెను మా తండ్రి
మనసులో సాక్ష్యమిట్లున్న
మనుజులెట్లన్నను-మాకేమి ||యెహో||
5 పరమ విభు జీవ గ్రంథములో
బ్రభుని రక్తాక్షరముద్రితమె
చిరముగా నుండు మా పేరు
చెఱుపు బెట్టెడు వారింకెవరు ||యెహో||
6 కరములతో నంటరాని
కన్నులకు గోచరముగాని
పరమ ఫలముల్ మాకున్నపుడు
సరకు గొన మిక్కడి లేములకు
యేసుఁడు మా యన్న గాఁడ
మహిమ గల శుద్ధాత్మ యిట్టి
వరుస దెలిపెంగద మా తోడ
1 మోక్ష నగరు మా పుట్టిల్లు
ముఖ్య దూతల్ మా స్నేహితులు
సాక్షాత్కారమైయున్నపుడు
లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహో||
2 అబ్రాహాము దావీదు మొదలైనట్టి
వర భక్తాగ్రేసరులే
శుభ్రముగ మా చుట్టా లైనన్
హర్షిమిఁక మా కేమి కొదువ ||యెహో||
3 పేతురాది సకలాపోస్తుల్
పేర్మిగల మా నిజ కూటస్థుల్
ఖ్యాతి సభలో మేమున్నప్పుడు
ఘనతలిక మాకేమి వెలితి ||యెహో||
4 తనువు బలిపెట్టెను మా యన్న
తప్పు ల్విడఁగొట్టెను మా తండ్రి
మనసులో సాక్ష్యమిట్లున్న
మనుజులెట్లన్నను-మాకేమి ||యెహో||
5 పరమ విభు జీవ గ్రంథములో
బ్రభుని రక్తాక్షరముద్రితమె
చిరముగా నుండు మా పేరు
చెఱుపు బెట్టెడు వారింకెవరు ||యెహో||
6 కరములతో నంటరాని
కన్నులకు గోచరముగాని
పరమ ఫలముల్ మాకున్నపుడు
సరకు గొన మిక్కడి లేములకు
No comments:
Post a Comment