Friday, 25 December 2015

జయ జయ యేసు-జయ యేసు

    జయ జయ యేసు-జయ యేసు
    జయ జయ క్రీస్తు-జయ క్రీస్తు 
    జయ జయ రాజా-జయ రాజా 
    జయ జయ స్తొత్రం-జయ స్తోత్రం ||జ||

1    మరణము గెల్చిన-జయ యేసు
    మరణము ఓడెను-జయ యేసు
    పరమ బలమొసగు-జయ యేసు
    శరణము నీవే-జయ యేసు      ||జ||

2    సమాధి గెల్చిన-జయ యేసు
    సమాధి ఓడెను-జయ యేసు
    క్షమియించుము నను-జయ యేసు
    అమరమూర్తివి-జయ యేసు      ||జ||

3    బండను గెల్చిన-జయ యేసు
    బండయు ఓడెను-జయ యేసు
    బండలు తీయుము-జయ యేసు
    అండకు చేర్చుము-జయ యేసు  ||జ||

4    ముద్రను గెల్చిన-జయ యేసు
    ముద్రయు ఓడెను-జయ యేసు
    ముద్రలు జీల్చుము-జయ యేసు
    ముద్రించుము నను-జయ యేసు ||జ||

5    కావలి గెల్చిన-జయ యేసు
    కావలి ఓడెను-జయ యేసు
    సేవలో బలమును-జయ యేసు
    జీవము నీవే-జయ యేసు        ||జ||

6    దయ్యాల గెల్చిన-జయ యేసు
    దయ్యాలు ఓడెను-జయ యేసు
    కయ్యము గెల్చిన-జయ యేసు 
    అయ్యో నీవె-జయ యేసు           ||జ||

7    సాతాను గెల్చిన-జయ యేసు
    సాతాను ఓడెను-జయ యేసు
    పాతవి గతించె-జయ యేసు
    దాతవు నీవె-జయ యేసు           ||జ||

No comments:

Post a Comment