Friday, 25 December 2015

భాసిల్లెను సిలువలో పాపక్షమా

    భాసిల్లెను సిలువలో పాపక్షమా
    యేసు ప్రభూ నీ దివ్య క్షమా
    భాసిల్లెను సిలువలో పాపక్షమా

1  కలువరిలో నా పాపము పొంచి
    సిలువకు నిన్ను యాహుతి చేసే
    కలుషహరా కరుణించితివి (2)   ||భా||

2  దోషము చేసితి నేనే గదా
    మోసముతో బ్రతికిన నేనే గదా
    మోసితివా నా శాప భారం (2)    ||భా||

3  పాపము జేసి గడించితి మరణం
    శాపమెగా నేనార్జించినది
    కాపరివై నను బ్రోచితివి (2)      ||భా||

4  నీ మరణపు వేదన వృధాగాదు
    నా మది నీ వేదనలో మునిగే
    క్షేమము కలిగెను
    హృదయములో (2)            ||భా||

5  ఎందులకో నా పై యీ ప్రేమ
    అందదయా - స్వామి నా మీదికి
    అందులకే భయమొందితిని (2) ||భా||

6  నమ్మిన వారిని కాదనవనియు
    నెమ్మది నొసగెడునా ప్రభుడవని
    నమ్మితి నీ పాదంబులను (2)   ||భా||

No comments:

Post a Comment