Friday, 25 December 2015

ఎపుడు చేరెద తేజ గృహమే

    ఎపుడు చేరెద తేజ గృహమే
    ఎపుడు చేరెద నా నివాసం
    ఎపుడు చేరెదను

1  దేవుడే నాకై యుంచిన వాసస్థలమే
    చేరెద సంతోషమంద
    యేసురాజు నా కొరకై
    సిలువనే చేర      ||ఎపుడు||

2  ఆశతీర యేసు సముఖం
    మధుర గానమే   
    నిత్యమే యేసుని నామం ప్రేమించియే 
    నేను పాడ ఆశతీరునే       ||ఎపుడు||

3  చెల్లించెదనే స్తోత్ర బలియే ఎల్లవేళలను 
    అర్పింతు స్తుతి ఘనమహిమ
    పేదనైన స్తోత్రము చేయ
    దేవుడనుగ్రహించె      ||ఎపుడు||

4  దైవకృపయే కరుణ యిదియే
    నేను చాటింప
    గీతముల్‌ దిన దినం మ్రోగ
    నిత్య కాలం ప్రేమహారం
    యేసుకే చెల్లున్‌           ||ఎపుడు||

5  ధ్యానించగ నా హృదయ పూర్వక 
    కృతజ్ఞతాస్తుతులే
    జ్ఞప్తియే యేసుని నగరం
    ప్రేమించియే నేను పాడ
    ఆశ తీరునే      ||ఎపుడు||

No comments:

Post a Comment