Friday, 25 December 2015

ప్రజలార వేగమె రారె

    prajalara vegame raare
    ప్రజలార వేగమె రారె
    నిజ దైవమును కనుగొనరె
    ప్రతివాడు మోక్షము జేర
    ప్రభు యేసు కథ విని పోరె     ||ప్రజ||

1  పాపాత్ము లనబడు వారి
    భారంబు దీయను గోరి
    ప్రభు యేసు చూపిన దారి
    పరమందు సుఖమిడు దారి    ||ప్రజ||

2  ఏ జాతి వారల నైన
    ఏ దేశ వాసుల నైన
    ఏమైన భేదము లేక
    యేసయ్య బ్రోచును గాన      ||ప్రజ||

3  పాపాత్ములే తన సుతులు
    ప్రభు యేసుకు స్నేహితులు
    నీ పాపమెల్లను పోవున్‌
    నీకింక మోక్షము కలుగున్‌      ||ప్రజ||

4  యేసయ్య గాకను వేరే
    యెవరైన లేరిక రారె
    దోషంబు లెల్లను బాపి
    ఆశీర్వదించును గాన           ||ప్రజ||

5  ప్రయాసపడి భారమును
    మోసెడి ఓ ప్రజలారా
    ప్రభు యేసు క్రీస్తే మీకు
    ప్రశాంతి నిచ్చును రండి        ||ప్రజ||

No comments:

Post a Comment