Friday, 25 December 2015

యౌవనుడా సంతోషపడుమా

    యౌవనుడా సంతోషపడుమా
    యౌవన కాలమున
    అయితే వీటిని బట్టి దేవుడు
    తీర్పులోనికి తెచ్చు నిన్ను 
    జ్ఞప్తినుంచుకో

1.    లేత వయసు నడి ప్రాయమును 
    గతించిపోవునవి - గనుక నీదు 
    హృదయములో - వ్యాకులమును 
    తొలగించుకొనుము - యువకుడా 
    వినుము       ||యౌవ||

2.    దుర్దినములు రాబోకముందే 
    వీటియందిపుడు 
    సంతోషము లేదని యెడు
    సంవత్సరములు రాబోక ముందే     
    చెడుగును విడుమా         ||యౌవ||

3.    పశ్చాత్తాపమున పాపములను 
    ఒప్పుకొనుచు నేడే 
    రక్షణార్థము రక్షకుడేసును  
    రయమున క్షమాపణ వేడిన 
    రక్షణ నీదే       ||యౌవ||

4.    మన్నయినది వెనుకటి వలెనే 
    మంటిలో కలియున్‌
    ఆత్మ దాని దయచేసిన
    దేవుని సన్నిధికి మరల    
    వెళ్ళును యౌవనుడా       ||యౌవ||

No comments:

Post a Comment