Friday, 25 December 2015

యెహోవా కొరకు-సహనముతో

    యెహోవా కొరకు-సహనముతో    
    కనిపెట్టన్‌
    నాకు చెవియెగ్గి నా-మొరనాలకించెన్‌
    నాశనకరమగు-గుంటలో నుండియు
    జిగటగల దొంగ ఊబి
    నుండి నన్‌ పైకెత్తెన్‌

1    నా పాదములను-బండపై నిలిపి
    దానిపై నా అడు-గులు స్థిరపరచి
    క్రొత్త గీతమును-నా నోట నుంచెను
    అనేకులు యెహోవా-యందు 
    నమ్మెదరు       ||నాశన||

2    గర్విష్టుల నబద్ధికు-లను లక్ష్యపెట్టక
    యెహోవాను నమ్ముకొనువాడె ధన్యుండు
    మా దేవా మా-యెడల నీకున్న
    తలంపులు బహు-విస్తారములు ||నాశన||

3    వాటిని వివరింప-నలవి కాదు
    నీకు సాటియైన వా-డొకడును లేడు
    బలి నైవేద్యము-లను కోరలేదు నీవు 
    నాకు చెవులను-నిర్మించినావు ||నాశన||

4    దహన బలుల పాప
    పరిహార బలులనైనను
    నీవు-తెమ్మనలేదు పుస్తకపు చుట్టలో- 
    నన్ను గూర్చి వ్రాయబడినట్లు నేను
    వచ్చియున్నాను         ||నాశన||

5    నీ చిత్తమును చేయ-నాకు సంతోషము
    నీ ధర్మశాస్త్రము 
    నా-ఆంతర్యములో నున్నది
    మహా సమాజములో 
    నీ-నీతి సువార్త ప్రకటించి 
    యున్నా-ననుకొంటిని       ||నాశన||

6    నీ నీతిని నా-హృదయములోన
    దాచుకొని నే నూర-కుండలేదు
    నీ రక్షణ స-త్యమును కృపయును
    మహా సమాజమునకు
    నేదాచలేదు      ||నాశన||

No comments:

Post a Comment