Friday, 25 December 2015

దేవర నీ దీవెనలు

    దేవర నీ దీవెనలు
    ధారాళముగను వీరలపై
    బాగుగ వేగమే దిగనిమ్ము
    పావన యేసుని ద్వారగను        ||దేవర||

1    దంపతులు దండిగ నీ
    ధాత్రిలో వెలయుచు సంపదలన్‌    
    సొంపుగ నింపుగ పెంపగుచు 
    సహింపున వీరు సుఖించుటకై ||దేవర||

2    ఈ కవను నీ కరుణన్‌
    ఆకరువరకును లోకములో
    శోకము లేకయె యేకముగా
    బ్రాకటముగను జేకొనుము        ||దేవర||

3    ఇప్పగిది నెప్పుడును
    గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
    మొప్పిన చొప్పున దప్పకను
    మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్‌ ||దేవర||

4    తాపములు పాపములు
    మోపుగ వీరిపై రాకుండగా
    గాపుగ బ్రాపుగ దాపునుండి
    యాపద లన్నియు బాపుచును ||దేవర||

5    సాధులుగన్‌ జేయుటకై
    శోధనలచే నీవు శోధింపగా
    కదలక వదలక ముదమున నీ
    పాదము దాపున బాదుకొనన్‌   ||దేవర||

6    మెండుగ భూమండలపు
    గండములలో వీరుండగను
    తండ్రిగ దండిగ నండనుండి
    వెండియు వానిని ఖండించవే  ||దేవర||

7    ఇద్ధర వీరిద్దరును
    శుద్ధులై నిన్ను సేవించుటకై
    శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్‌
    దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్‌ ||దేవర||

8    వాసిగ నీ దాసులము
    చేసిన యీ మొఱల్‌ దీసికొని
    మా సకలేశ్వర నీ సుతుడౌ
    యేసుని పేరట బ్రోవుమామేన్‌ ||దేవర||

No comments:

Post a Comment