Friday, 25 December 2015

జాలమేలా జేసె దరూ

    జాలమేలా జేసె దరూ
    మేలుకొని ప్రభు జేరన్‌
    ప్రాలుమాలిన జీవమేల? 
    కాలయాపనదేలా?
    మేలుకొనుడీ మీ మనములన్‌ 
    జాలిగల పిలుపున్‌ మీరల్‌ విని ||జాల||

1    ఎంత కాలము చింతలలో
    మునిగి యుండెదరేలా
    చెంతజేర రండి నేడే
    చింతలన్‌ దీర్చున్‌ ప్రభు వింతగ ||జాల||

2    లోక పుటాశలు జుట్టి మనలన్‌
    లోక మునకే జేర్చున్‌
    లోకరక్షకుడేసే మనలన్‌
    ప్రాకటము బ్రోచున్‌ వాస్తవమిదె ||జాల||

3    సందియంబులు గలిగి నీవు
    గుంది యుండెదవేలా
    వందితుండౌ యేసు ప్రభు 
    పాదములను-బ్రతిమాలుము   ||జాల||

4    కఠిన హృదయము కరుగదేలా?
    కఠిన హృదయమదేలా
    కుటిల     వర్తనమంత వీడుము
    పఠన జేయుచు దైవగ్రంథము  ||జాల||

5    మోసబోకుడి దాసజనమా
    నాశనమె మన గతియౌ
    నీ సురక్షకుడేసు     ప్రభువే
    యాశ్రయమె సుమ్మాయని నమ్ముము
6    పాప దాస్యమందు జిక్కి    
    శాపగ్రస్తుడవౌదు
    పాపజీవితము మరణమౌగా
    కృపయే యేసుని దానము జీవము   

7    మారుమనసు నొంద రండి
    భారములు కడద్రోసి
    నేరమెంచని యేసు కృపను
    కోరుకొని జీవింపగ రండి        ||జాల||

8    కోరుకొనుడి రక్షణంబును
    కోరుకొనుడి నేడే
    కోరువారికి జీవజలముల్‌ 
    కోరికలు దీర నిచ్చును ప్రభు   ||జాల||

No comments:

Post a Comment