Friday, 25 December 2015

మేఘాల మీద మన ప్రభు యేసు

    మేఘాల మీద మన ప్రభు యేసు    
    మహికి ఏతెంచు వేళ ఆసన్నమాయె
    భువికి ఏతెంచు వేళ

1    మెరుపు రథముల మీద
    ఉరుము బాటలపైన
    మన యేసుడరుదెంచగా
    మరణ కోటలలోన
    నిదురించు ప్రియులంత
    మహిమకాయములొందుచు
    మీది లోకాల మోదాంలోన
    ప్రియ ప్రభుని దర్శింతుము      ||మే||

2    మధ్యాకాశములోని
    దూత పంక్తుల నడుమ
    మరియ సుతుడగు పించగా
    మరణమొందక మిగులు
    రారాజు జనులంతా
    కాంతి దేహములు దాల్చుచూ
    మెరుపు దీపాలై-మహిమ రూపాలై
    వరుని ముఖమును గాంతురు  ||మే||

3    దేవా దేవుని మహిమ
    దిశలెల్ల విరబూయ
    దేవసుతుడరుదెంచెను
    దయనొందు ప్రియులంతా
    కొలువు దీర్చగ ప్రభువు
    దానములు దయచేయును
    ధవళ వస్త్రాలు-నీతి మకుటాలు
    ముదమార ధరియింతుము      ||మే||

4    కలకాలము పంట వరుడేసు 
    పరిణయము-కమనీయముగ సాగుచూ 
    కళ్యాణకాంతులతో
    దేవాలోకపు కళతో
    వధువు వదనము మెరియగ
    కనకహారాలు పుణ్యవరాలు
    అక్షింతలై కురియుచుండ        ||మే||

4 comments: