Friday, 25 December 2015

రుచి చూచి యెరిగితిని

    రుచి చూచి యెరిగితిని
    యెహోవా ఉత్తముడనియు
    రక్షకునాశ్రయించి
    నే ధన్యుడనైతిని        ||రుచి||

1     గొప్ప దేవుడవు నీవే
    స్తుతులకు పాత్రుడ వీవే
    తప్పక ఆరాధింతు
    దయాళుడవు నీవే        ||రుచి||

2    మహోన్నతుడవగు దేవా
    ప్రభావము గలవాడా
    మనసార పొగడెదను
    నీ ఆశ్చర్య కార్యములన్‌        ||రుచి||

3    మంచి తనము గల దేవా
    అతి శ్రేష్టుడవు అందరిలో
    ముదమార పాడెద నిన్ను
    అతి సుందరుడ వనియు        ||రుచి||

4    నా జీవిత మంతయును
    యెహోవాను స్తుతియించెదను
    నా బ్రతుకు కాలములో
    నా దేవుని కీర్తింతున్‌        ||రుచి||

5    సంతోషింతు నెల్లప్పుడు
    కష్ట దుఃఖ బాధలలో
    ఎంతో నెమ్మది నిచ్చు
    నా రక్షకుడు నా యేసు        ||రుచి||

6    ప్రార్థింతును యెడ తెగక
    ప్రభు సన్నిధిలో చేరి
    సంపూర్ణముగా పొందెదను
    అడుగు వాటన్నిటిని        ||రుచి||

7    కృతజ్ఞత చెల్లింతు
    ప్రతి దాని కొరకు నేను
    క్రీస్తుని యందే తృప్తి
    పొంది హర్షించెదను        ||రుచి||

No comments:

Post a Comment