Friday, 25 December 2015

అమూల్య రక్తము ద్వారా

    అమూల్య రక్తము ద్వారా
    రక్షణ పొందిన జనులారా
    సర్వశక్తుని ప్రజలారా
    పరిశుద్ధులారా పాడెదము
    ఘనతా మహిమ స్తుతులను
    పరిశుద్ధులారా పాడెదము

1    మన యౌవన జీవితముల్‌
    శరీరాశలకు లోబరచి
    చెడుమాటలను పలుకుచు
    శాంతి లేక యుంటిమిగా      ||అమూ||

2    చెడు మార్గమున బోతిమి
    దాని యంతము మరణము
    నరక శిక్షకు లోబడుచు
    పాపపు ధనము పొందితిమి   ||అమూ||

3    నిత్య సత్య దేవుని
    నామమున మొరలిడక
    స్వంత నీతి తోడనే
    దేవుని రాజ్యము కోరితిమి        ||అమూ||

4    కనికరము గల దేవుడు
    మానవ రూపము దాల్చెను
    ప్రాణము సిలువను బలి చేసి
    మనల విమోచించెను       ||అమూ||

5    తన రక్త ధారలలో
    మన పాపములను కడిగి
    మన కన్నులను తెరచి
    మనల నింపెను జ్ఞానముతో ||అమూ||

6    పాపులమైన మన మీద
    తన యాశ్చర్య ఘన ప్రేమ
    కుమ్మరించెను మన ప్రభువు
    కృతజ్ఞత చెల్లింతుము      ||అమూ||

7    మన రక్షకుని స్తుతించెదము
    మనలను జేసెను ధన్యులుగా
    మన దేవుని కర్పించెదము
    ఆత్మ జీవ శరీరములన్‌      ||అమూ||

No comments:

Post a Comment