Friday, 25 December 2015

పరిశుద్ధ జీవిత మరయుడి ధరనిక

    పరిశుద్ధ జీవిత మరయుడి ధరనిక
    ప్రభురాక చాల సమీపమాయె
    తండ్రి వాగ్దానములు నెరవేరెనని
    సిద్ధపడుద మహా

1    కరువులు యుద్ధము
    కాటకములు - భూ-కంపములన్‌ 
    హతులైరి జనుల్‌
    విభుపాదముల్‌ సేవింప నెగయుటకై 
    సిద్ధపడుద మహా         ||పరి||

2    రాజ గృహంబుల-పేదల యిండ్లను
    ప్రజలకు స్వస్థత లేదు గదా
    ప్రభు రాకడ కిదియును
    సూచన యని
    సిద్ధపడుద మహా         ||పరి||

3    ఆకాశ శక్తులు-భీకరముగ దమ
    మూకల బాసియు శాఖలాయె
    యేసు రాకడ కిదియును
    సూచన యని
    సిద్ధపడుద మహా         ||పరి||

4    జీవపు డాంభికులీ వసుధను దమ
    జీవపు టాశలలోన బడె
    దైవ జీవము బొందగ
    నందరమును
    సిద్ధపడుద మహా         ||పరి||

5    సౌందర్య రాశియు 
    చక్కని రూపియు
    సత్య దూతాళితో సరగ వచ్చున్‌
    ప్రభు సారూప్య మొందియు
    నెదురేగుటకు
    సిద్ధపడుద మహా         ||పరి||

6    పెండ్లి కుమారుడు
    ప్రేమ స్వరూపుడు 
    విడిది గదిని-సిద్ధపరచె నహా
    ప్రియ కడ జను పెండ్లి
    కుమార్తెవలెన్‌
    సిద్ధపడుద మహా         ||పరి||

No comments:

Post a Comment