Friday, 25 December 2015

యెహోవా నా మొఱ లాలించెను

    యెహోవా నా మొఱ లాలించెను
    దన-మహా దయను నను గణించెను 
    అహర్నిశల దీనహీనుడగు నా 
    దు హాయనెడు ధ్వని 
    గ్రహించి మనిపెను      ||యెహో||

1    పిశాచి గడిమి బడగొట్టెను
    దన వశాన నను నిలువ బెట్టెను
    ప్రశాంత  మధుర సు - విశేష వాక్ఫల 
    నిశాంతమున 
    జే - ర్చిసేద దీర్చెను       ||యెహో||

2    మదావళము బోలు నామదిన్‌
    దన - ప్రదీప్త వాక్యాం కుశాహతిన్‌
    యధేచ్ఛలన్నిటి గుదించి పాపపు
    మొదల్‌ తుదల్‌ 
    నరి - కిదరికి చేర్చెను      ||యెహో||

3    అనీతి వస్త్ర మెడలించెను 
    యే - సునాధు రక్తమున ముంచెను
    వినూత్న యత్నమె - ద నూని యెన్నడు 
    గనన్‌ వినన్‌ బ్రేమనాకు చూపెను       ||యెహో||

4    విలాపములకు జెవి నిచ్చెను
    శ్రమ - కలాపములకు సెలవిచ్చెను
    శిలానగము పై - కి లాగి నను
    సుఖ - కళావళుల్‌
    మన-సులోన నిలిపెను      ||యెహో||

5    అగణ్య పాపియని త్రోయక న-న్ను 
    గూర్చి తన సుతుని దాచక
    తెగించి మృతి కొప్పగించి పాపపు
    నెగుల్‌ దిగుల్‌
    సొగసుగా నణంచెను    ||యెహోవా||

No comments:

Post a Comment