దేవుడు మీకు యెల్లప్పుడు
తోడుగనున్నాడు (2) ||తోడుగ||
1. ఏదెనులో ఆదాముతో నుండెన్
హనోకు తోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్
ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2. దైవాజ్ఞను శిరసావహించి
దివ్యముగ నబ్రహాము
కన్న కొమరుని ఖండించుటకు
ఖడ్గమునెత్తినయపుడు ||తోడుగ||
3. యోసేపు ద్వేషించబడినపుడు
గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు
సింహాసన మెక్కినపుడు ||తోడుగ||
4. ఫరోరాజు తరిమినయపుడు
ఎఱ్ఱ సంద్రపు తీరమున
యోర్దానునది దాటునపుడు
యెరికో కూలిన యపుడు ||తోడుగ||
5. దావీదు సింహము నెదిరించి
ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు ||తోడుగ||
6. సింహపు బోనులో దానియేలు
షడ్రకు మెషాకబెద్నెగో
అగ్నిగుండములో వేయబడన్
నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
7. పౌలు బంధించబడినపుడు
పేతురు చెఱలోనున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు
హింసించబడిన యపుడు ||తోడుగ||
తోడుగనున్నాడు (2) ||తోడుగ||
1. ఏదెనులో ఆదాముతో నుండెన్
హనోకు తోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్
ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2. దైవాజ్ఞను శిరసావహించి
దివ్యముగ నబ్రహాము
కన్న కొమరుని ఖండించుటకు
ఖడ్గమునెత్తినయపుడు ||తోడుగ||
3. యోసేపు ద్వేషించబడినపుడు
గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెఱసాలయందు
సింహాసన మెక్కినపుడు ||తోడుగ||
4. ఫరోరాజు తరిమినయపుడు
ఎఱ్ఱ సంద్రపు తీరమున
యోర్దానునది దాటునపుడు
యెరికో కూలిన యపుడు ||తోడుగ||
5. దావీదు సింహము నెదిరించి
ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు ||తోడుగ||
6. సింహపు బోనులో దానియేలు
షడ్రకు మెషాకబెద్నెగో
అగ్నిగుండములో వేయబడన్
నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
7. పౌలు బంధించబడినపుడు
పేతురు చెఱలోనున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు
హింసించబడిన యపుడు ||తోడుగ||
No comments:
Post a Comment