Friday, 25 December 2015

ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది

    ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది
    జల్లించెను సాతాను నిన్ను
    జారితివే మరి వేసారితివే        ||ఓహో||

1    విజయముగా బ్రతుకను వృజినమున 
    నిజదైవము నిను సృజి యించెనుగా
    జారితివే వేసారితివే - వెనుకాడియు    
    వేషము విడువవా        ||ఓహో||

2    సాతానుని ఒడిలో నిదురించి
    సర్వేశుని బోధలు ఎదిరించి
    మానసము మసిగారినను
    మలినమును మలుపగలేవా   ||ఓహో||

3    గద్దించెడు మనస్సాక్షిని ద్రోసి
    ఘనదేవుని మార్గములను రోసి
    దాస్యమను ధనమోహమును
    దాహముతో త్రాగెదవేమి?        ||ఓహో||

4    ఆత్మలో ఆనందము అణగారి
    ఆవేశము లేకను దిగజారి
    అన్నిటిలో నే నధికుడ ననుచు
    ఆర్భాటము చేసెదవేమి?        ||ఓహో||

5    ఎన్నో మేలులు తరుణములు
    యేసుడు నీకివ్వగ కరుణించి 
    తామసము మరి జేయుదువా
    తండ్రి కౌగిలి జేరవా        ||ఓహో||

4 comments: