Friday, 25 December 2015

ఎవని అతిక్రమము - మన్నింపబడెనో

    ఎవని అతిక్రమము - మన్నింపబడెనో
    పాప పరిహార మెవడొందేనో 
    వాడే ధన్యుండు

1    యెహోవాచే నిర్దోషిగా - తీర్చబడియు
    ఆత్మ - లో కపటములేని
    వాడే ధన్యుండు       ||ఎవని||

2    మౌనియైయుండ దినమెల్ల 
    నే చేసినట్టి ఆర్త - ధ్వనిచే నా 
    యెముకలు - క్షీణించెను       ||ఎవని||

3    దివారాత్రులు నీ చెయ్‌ నాపై 
    బరువైయుండ నా సారము వేసవిలో 
    ఎండినట్లాయె       ||ఎవని||

4    నేను నా దోషమును - కప్పుకొనక
    నీ యెదుట నా పాపము  
    నొప్పుకొంటిని        ||ఎవని||

5    నీ సన్నిధి నా యతిక్రమము
    నొప్పు కొనగా నీవు నా దోషమును 
    మన్నించితివిగా          ||ఎవని||

6.    కావున నీ దర్శన- కాలమందు   
    భక్తి గలవారందరు నిన్ను
    ప్రార్థింతురు           ||ఎవని||

7.    విస్తారము జలప్రవాహము పొర్లినను 
    నిశ్చయముగా నవి వారి 
    మీదికి రావు       ||ఎవని|| 

2 comments: