Friday, 25 December 2015

కొనియాడదరమె నిన్ను

    కొనియాడదరమె నిన్ను
    కోమల హృదయ
    కొనియాడఁదరమె నిన్ను
    తన రారు దినకరుఁ
    బెనుతారలను మించు
    ఘనతేజమున నొప్పు
    కాంతి మంతుడ వీవు         ||కొని||

1    ఖెరుబులు సెరుపులు
    మరి దూతగణములు  
    నురుతరంబుగఁగొలువ
    నొప్పు శ్రేష్టుడ వీవు         ||కొని||

2    సర్వలోకంబులం-బర్వు
    దేవుడ వయ్యు 
    నుర్వి స్త్రీగర్భాన
    నుద్భవించితివి వీవు         ||కొని||

3    విశ్వమంతయు నేలు
    వీరాసనుఁడవయ్యు
    పశ్వాళితో దొట్టి
    పడియుంటివి నీవు         ||కొని||

4    దోసంబులను మడియు 
    దాసాళిగరుణించి
    యేసు పేరున జగతి
    కేగుదెంచితి నీవు         ||కొని||

5    నరులయందున గరుణ
    ధర సమాధానంబు
    చిరకాలమును మహిమ
    పరఁగఁ జేయుదు వీవు         ||కొని||

6    ఓ యేసు పాన్పుగ
    నాయాత్మ జేకొని
    శ్రేయముగ బవళించు
    శ్రీ కర వరసుత         ||కొని||

No comments:

Post a Comment