శాశ్వతమైనది ప్రేమ
యెహోవా తండ్రి ప్రేమ
ప్రేమలో భయమేమియు లేదు
ప్రేమ పరిపూర్ణంబైయున్న
భయమును పారగ ద్రోలున్
1. దీర్ఘకాలము ప్రేమ
దయచూపి సహించును
మత్సరపడ దీయుత్తమ ప్రేమ
డంబముగా నడువని దీ ప్రేమ
ఉప్పొంగని దీ ప్రేమ ||శాశ్వత||
2. స్వప్రయోజనమును
ఎప్పుడు కోరనిదీ ప్రేమ
అమర్యాదగ నడువని ప్రేమ
త్వరగా కోపపడని ప్రేమ
తలచదు అపకారమును ||శాశ్వత||
3. దుర్నీతిలో గాక
సత్యాన సంతోషించున్
అన్నిటికి తాళుకొను ప్రేమ
అన్నిటిని నమ్మి యోర్చెడి ప్రేమ
అన్నిటి నిరీక్షించున్ ||శాశ్వత||
4. నిలుచును విశ్వాసము
నిరీక్షణయు మరి ప్రేమ
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
ప్రేమను కల్గియుండుటకు
ప్రయత్నించుడి మీరు ||శాశ్వత||
5. ప్రేమ లేనివాడు
దేవుని యెరుగనివాడు
మన దేవుడు ప్రేమ స్వరూపి
తన ప్రేమ మనలో సంపూర్ణ
సిద్ధిని పొందవలయు ||శాశ్వత||
6. నిన్నడుగుచున్నాడు
నిను ప్రేమించిన ప్రభు యేసు
నన్ను ప్రేమించుచున్నావా?
వీరికంటె నాపై నీకు
ఎక్కువ ప్రేమగలదా ||శాశ్వత||
7. నను ప్రేమించినయెడల
నా యాజ్ఞలను గైకొనుము
మీలో మీరు ఒకరి నొకరు
ప్రేమించుకొనుచున్నయెడల
అదియే మహదానందం ||శాశ్వత||
యెహోవా తండ్రి ప్రేమ
ప్రేమలో భయమేమియు లేదు
ప్రేమ పరిపూర్ణంబైయున్న
భయమును పారగ ద్రోలున్
1. దీర్ఘకాలము ప్రేమ
దయచూపి సహించును
మత్సరపడ దీయుత్తమ ప్రేమ
డంబముగా నడువని దీ ప్రేమ
ఉప్పొంగని దీ ప్రేమ ||శాశ్వత||
2. స్వప్రయోజనమును
ఎప్పుడు కోరనిదీ ప్రేమ
అమర్యాదగ నడువని ప్రేమ
త్వరగా కోపపడని ప్రేమ
తలచదు అపకారమును ||శాశ్వత||
3. దుర్నీతిలో గాక
సత్యాన సంతోషించున్
అన్నిటికి తాళుకొను ప్రేమ
అన్నిటిని నమ్మి యోర్చెడి ప్రేమ
అన్నిటి నిరీక్షించున్ ||శాశ్వత||
4. నిలుచును విశ్వాసము
నిరీక్షణయు మరి ప్రేమ
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ
ప్రేమను కల్గియుండుటకు
ప్రయత్నించుడి మీరు ||శాశ్వత||
5. ప్రేమ లేనివాడు
దేవుని యెరుగనివాడు
మన దేవుడు ప్రేమ స్వరూపి
తన ప్రేమ మనలో సంపూర్ణ
సిద్ధిని పొందవలయు ||శాశ్వత||
6. నిన్నడుగుచున్నాడు
నిను ప్రేమించిన ప్రభు యేసు
నన్ను ప్రేమించుచున్నావా?
వీరికంటె నాపై నీకు
ఎక్కువ ప్రేమగలదా ||శాశ్వత||
7. నను ప్రేమించినయెడల
నా యాజ్ఞలను గైకొనుము
మీలో మీరు ఒకరి నొకరు
ప్రేమించుకొనుచున్నయెడల
అదియే మహదానందం ||శాశ్వత||
Good song good background, colour
ReplyDeleteNice song
ReplyDelete👌
ReplyDeleteGood song meaning is very good
ReplyDeleteదేవునికి స్తోత్రములు హల్లెలూయ ఆమెన్! 🙏✝️🙏
ReplyDeleteThank you 🙏
ReplyDeletegood song
ReplyDelete