Friday, 25 December 2015

ప్రభు యేసుని వదనములో

    ప్రభు యేసుని వదనములో
    నా దేవుడు కనిపించే
    పాపాత్ముల బ్రోచుటకై
    కృపలొలికిన కలువరిలో 
    పరలోకముకై చిరజీవముకై
    ప్రార్థించెను నా హృదయం 

1.    దిశలన్నియు తిరిగితిని
    నా పాపపు దాహముతో
    దౌష్ట్యములో మసలుచును
    దౌర్జన్యము చేయుచును 
    ధనపీడనతో- మృగవాంఛలతో
    దిగజారితి చావునకు         ||ప్రభు||

2.    చెండాడితి బ్రతుకులను
    దహియించితి గృహములను
    చెరగవు నా పాపములు
    తరగవు నా వేదనలు   
    చనిపోయినను ధర వీడినను
    చల్లారవు శోకములు          ||ప్రభు||

3.    పలుమారులు వినుచుంటి   
    నజరేయుని నీతికథ
    పరిహాసము చేసితిని
    పరమార్థమే మోసమని
    పశుప్రాయుడనై జీవించుటచే
    ప్రాప్తించెను ఈ సిలువ        ||ప్రభు||

4.    కలువరి ఆవరణములో
    కరుణాత్ముని చేరువనే
    కనుమూసిన కాలములో
    వెలుగుదయించినవేళ
    కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి
    కంపించెను నా హృదయం    ||ప్రభు||

5.    యేసూ నీ రాజ్యముతో
    భువికేతెంచెడి రోజు
    ఈ పాపిని క్షమియించి
    జ్ఞాపకముతో బ్రోవుమని 
    ఇలవేడితిని విలపించుచును
    ఈడేరెను నా వినతి       ||ప్రభు||

6.    పరదైసున ఈ దినమే
    నా యానందములోన
    పాల్గొందువు నీవనుచు
    వాగ్దానము చేయగనే
    పరలోకమే నా తుదియూపిరిగా 
    పయనించితి ప్రభుకడకు      ||ప్రభు||

No comments:

Post a Comment