Friday, 25 December 2015

క్రొత్తయేడు మొదలుబెట్టెను

    క్రొత్తయేడు మొదలుబెట్టెను
    మన బ్రతుకునందు క్రొత్త...
    క్రొత్త మనసుతోడ మీరు
    క్రొత్త యేట ప్రభుని సేవ
    దత్తర పడకుండ జేయు    
    టుత్తమోత్తమంబు జూడ         ||క్రొత్త||

1.    పొందియున్న మేలులన్నియు 
    బొంకంబు మీఱ
    డెందమందు స్మరణ చేయుడీ
    యిందు మీరు మొదలుబెట్టు
    పందెమందు గెల్వవలయు
    నందముగను రవిని బోలి
    నలయకుండ మెలయకుండ   ||క్రొత్త||

2.    మేలు సేయ దడ వొనర్పగా
    మీ రెఱుగునట్లు
    కాలమంత నిరుడు గడచెగా
    ప్రాలు మాలి యుండకుండ
    జాలమేల సేయవలయు
    జాల జనముల కిమ్మాను
    యేలు నామ ఘనత కొఱకు    ||క్రొత్త||

3.    బలములేని వారమయ్యును
    బల మొందవచ్చు
    గలిమి మీఱ గర్త వాక్కున
    నలయకుండ నడుగుచుండ
    నలగకుండ మోదమొంది
    బలమొసంగు సర్వవిధుల
    నెలమి మీ రొనర్చుచుండ         ||క్రొత్త||

4.    ఇద్దరిత్రి నుండునప్పుడే
    యీశ్వరుని జనులు
    వృద్ధి బొంద జూడవలయును
    బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద 
    శ్రద్ధ జేయ - శుద్ధులైనవారిలో 
    ప్ర-సిద్ధులగుచు వెలుగవచ్చు   ||క్రొత్త||

5.     పాప పంకమంటినప్పుడు
    ప్రభు క్రీస్తు యేసు
    ప్రాపు జేరి మీరు వేడగా
    నేపు మీఱ దనదు కరుణ
    బాప మంత గడిగివేసి
    పాప రోగ చిహ్నలన్ని
    బాపివేసి శుద్ధిజేయు          ||క్రొత్త||

No comments:

Post a Comment