Friday, 25 December 2015

ఇదియే సమయంబు రండి

    ఇదియే సమయంబు రండి
    యేసుని చేరండి
    ఇక సమయము లేదండీరండి   
    రక్షణ పొందండి

1    పాపుల నందరిని తన దాపున జేర్చుటకై 
    ప్రాణము దానముగా తన 
    ప్రాణము నిచ్చెనుగా
    మరణపు ముల్లును విరచి 
    విజయము నిచ్చెనుగా    ||ఇదియే||

2    రాజులకు రాజైన యేసు
    రానై యున్నాడు
    గురుతులు జరిగెనుగా
    మీరు సరిగా చూడండి
    తరుణముండగానే మీరు
    తయ్యారవ్వండి    ||ఇదియే||

3    బుద్ధిలేని కన్యకల వలె
    మొద్దులుగా నుంటే
    సిద్దెలతో నూనె
    మీరు సిద్ధపడక పోతే
    ద్వారము మూయగనే మీకు 
    దారి దొరకదేమో    ||ఇదియే||

4    వెలుపల నుంటేను
    మీరు వేదన నొందెదరు
    తలుపు తట్టినను
    మీకు తెరువడు సుమ్మండి
    మిమ్మును ఎరుగనూ
    మీరు ఎవరో పొమ్మనును    ||ఇదియే|| 

5    నమ్మిన వారికి క్రీస్తు
    నెమ్మది నిచ్చునుగా
    నమ్మని వారికి
    నిత్య నరకమె సుమ్మండి
    నిర్లక్ష్యము చేయకను రండి
    రక్షణ నొందండి    ||ఇదియే||

6    సందియ పడకండి
    మీరు సాకులు చెప్పకను
    తరుణముండగానే
    మీరు త్వరపడి రారండి
    మరణమెప్పుడొచ్చున్‌ మనకు
    తెలియదు సుమ్మండి    ||ఇదియే||

7    జాలము చేయకను
    మీరు హేళన చేయకను
    కులము స్థలమనుచు
    మీరు కాలము గడుపకను
    హల్లెలూయ పాటలు బాడ
    నెల్లరును రండి    ||ఇదియే||

No comments:

Post a Comment