Friday, 25 December 2015

దేవుని వారసులం

    దేవుని వారసులం
    ప్రేమ నివాసులము
    జీవన యాత్రికులం
    యేసుని దాసులము
    నవయుగ సైనికులం 
    పరలోకపౌరులము 
    హల్లెలూయ-నవయుగ

1    దారుణ హింసలలో
    దేవుని దూతలుగా
    ఆరని జ్వాలలలో
    ఆగని జయములతో
    మారని ప్రేమ సమర్పణతో
    సర్వత్ర యేసును కీర్తింతుము    ||దే||

2.    పరిశుద్ధాత్మునికై
    ప్రార్థన సలుపుదము
    పరమాత్ముని రాక
    బలము ప్రసాదింప
    ధరణిలో ప్రభువును జూపుటకై 
    సర్వాంగహోమము జేయుదము  ||దే||

3.    అనుదిన కూటములు
    అందరి గృహములలో 
    ఆనందముతోను ఆరాధనలాయే
    వీనులవిందగు పాటలతో
    ధ్యానము చేయుచు
    మురియుదము                  ||దే||

4    సజీవ సిలువ ప్రభు 
    సమాధి     గెలుచుటచే
    విజేత ప్రేమికులం
    విధేయ బోధకులం
    నిజముగ రక్షణ ప్రబలుటకై
    ధ్వజముగ సిలువను నిలుపుదము ||దే||

5    గోధుమ గింజవలె
    క్రీస్తుడు చావగను
    నాధుని మరణములో
    శాశ్వత జీవమును
    నిధులుగ పండించి తేవగను
    మాధుర్య రక్షణ లభియించెను  ||దే||

6.    హత సాక్షుల కాలం
    అవనిలో చెలరేగ
    గతకాలపు సేవ
    గొల్గొత గిరి చేర
    భీతులలో బహురీతులలో
    నూతన లోకము కాంక్షింతుము   ||దే||

7.    ప్రభువును చూచుటకై
    ప్రజలందరు రాగ
    విభు మహిమను గాంచ 
    విశ్వమే మముగోర
    శుభములు గూర్చుచు మాలోన 
    శోభిల్లు యేసును జూపుదము     ||దే||

No comments:

Post a Comment