Friday, 25 December 2015

యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా

    యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా   
    రావేల ఓ యువకా... రావేల ఓ యువతీ 
    నీ హృదయము ప్రభుకిమ్ము
    ప్రభు జీవము నీదగును

1. గురిలేని నీ బ్రతుకు
    ఎరయాయెను విరోధికి 
    త్వరపడకుంటే నీకు
    మరి తప్పదు నరకాగ్ని        ||నీ హృ||

2. నీ దేహము దేవునిది
    శుద్ధాత్మకు నిలయమది
    ప్రభు కర్పణ చేయనిదే
    పడగొట్టును అపవాది        ||నీ హృ||

3. ప్రభు వనమున పనిచేయ
    పనివారలు కావలెను
    వినలేవా ప్రభు స్వరము
    కనలేవా ప్రభు పొలము       ||నీ హృ||

4. దుర్దినములు రాకముందే
    స్మరియించుము రక్షకుని 
    ఘనమైన రక్షణను
    నిర్లక్ష్యము చేయుదువా        ||నీ హృ||

5. నీ యౌవన కాలమున
    ప్రభుకాడిని మోయవలెన్‌ 
    మేలొందెద వీనాడే
    జాగేలను యువజనమా     ||నీ హృ||

21 comments:

  1. Give ur heart to ur lord Christ

    ReplyDelete
  2. It seems like short song but conveys more spritual meaning

    ReplyDelete
  3. Meaningful and heart touching song. Praise God

    ReplyDelete
  4. Meaningful and heart touching song. Praise God

    Reply

    ReplyDelete
  5. My lovely song

    ReplyDelete
  6. A good song for every young people
    Glory to God ❤🙏

    ReplyDelete
  7. వాట్సాప్ సెండ్అప్సన్ పెట్టగలరు

    ReplyDelete
  8. God's love gives every one take uuuu

    ReplyDelete
  9. Hello God bless you

    ReplyDelete
  10. Super song ✝️

    ReplyDelete