Friday, 25 December 2015

ఏ పాప మెరుగని - యో పావన

    ఏ పాప మెరుగని - యో పావన
    మూర్తి పాప - విమోచకుండ
    నా పాలి దైవమా - నా పాపముల 
    కొర-కీ పాట్లు నొందినావా

1    ముళ్ళతో ఁ గిరీట - మల్లి నీ 
    శిరముపైఁ జల్లాటమున మొత్తిరా
    ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ 
    సొమ్మ సిల్లిపోతివి రక్షకా           ||ఏ||

2    కలువరి  గిరి దనుక - సిలువ 
    మోయలేక - కలవరము నొందినావా
    సిలువ నీతో మోయ - దులువలు 
    వేరొకని దోడుగా నిచ్చినారా           ||ఏ||

3    చెడుగు యూదులు బెట్టు
    పడరాని పాట్లకు - సుడివడి నడచినావా
    కడకు కల్వరిగిరి - కడకేగి సిల్వను 
    గ్రక్కున   దించినావా           ||ఏ||

4    ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను
    నా కొయ్యపై నుంచిరా - నీ కాలు 
    సేతుల నా కొయ్యకే సూది
    మేకులతో గ్రుచ్చినారా           ||ఏ||

5    పలువిధంబుల శ్రమలు-చెలరేగఁ    
    దండ్రికి-నెలుగెత్తి మొరలిడితివా
    సిలువపై బలుమారు - కలుగుచుండెడి 
    బాధ - వలన దాహము నాయెనా ||ఏ||

6    బల్లిదుండగు బంటు బల్లెమున నీ 
    ప్రక్క - జిల్లిబడ బొడిచినాడా 
    ఉల్లోలముల వలె - నల్ల  నీ 
    రుబుకంగ - జల్లారె గద కోపము ||ఏ||

7    కటకటా పాప సంకటముఁబాపుట 
    కింత - పటు బాధ నొందినావా
    ఎటువంటి దీ ప్రేమ
    యెటువంటి దీశాంత 
    మెటుల వర్ణింతు స్వామి          ||ఏ||

2 comments:

  1. What a great explanation about the incident.. it's not possible to sing without tears.

    ReplyDelete