Friday, 25 December 2015

నన్ను దిద్దుము చిన్న ప్రాయము

    నన్ను దిద్దుము చిన్న ప్రాయము
    సన్నుతుండగు నాయనా 
    నీవు కన్న తండ్రి వనుచు నేను   
    నిన్ను జేరితి నాయనా         ||నన్ను||

1    దూరమునకు బోయి నీదరి
    జేరనైతిని నాయనా
    నేను కారు మూర్ఖపు పిల్లనై కా-రడవి 
    దిరిగితి నాయనా         ||నన్ను||

2    మంచి మార్గము  లేదు నాలో
    మరణ పాత్రుడ నాయనా
    నేను వంచితుండనైతిని ప్ర-పంచ 
    మందున నాయనా        ||నన్ను||

3    చాలా మారులు తప్పిపోతిని
    మేలు గానక నాయనా
    నా     చాల మొరల నాలకించుము
    జాలి గల నా నాయనా        ||నన్ను||

4    జ్ఞాన మంతయు బాడు జేసి
    కాననైతిని నాయనా
    నీవు జ్ఞానము గల తండ్రి వంచు
    జ్ఞప్తి వచ్చెను నాయనా        ||నన్ను||

5    కొద్ది నరుఁడను దిద్దినను నీ
    యొద్ద చేర్చుము నాయనా
    నీ యొద్ద జేర్చి బుద్ధి జెప్పుము
    మొద్దు నైతిని నాయనా        ||నన్ను||

6    ఎక్కడను నీ వంటి మార్గము
    నెరుగనైతిని నాయనా 
    నీ     రెక్క చాటున నన్ను జేర్చి
    చక్కపరచుము నాయనా      ||నన్ను||

7    శత్రువగు సాతాను నన్ను
    మిత్రు జేయను నాయనా
    ఎన్నో     సూత్రములు గల్పించెను నా
    నేత్రములకో నాయనా         ||నన్ను||

8    వాసిగా నేఁ బాపలోకపు
    వాసుడనో నాయనా 
    నీ దాసులలో నొకనిగా ననుఁ జేసి 
    కావుము నాయనా        ||నన్ను||

No comments:

Post a Comment