Friday, 25 December 2015

మా యేసుక్రీస్తుని-మఱుఁగు గల్గెనురా

    మా యేసుక్రీస్తుని-మఱుఁగు గల్గెనురా 
    నా యాత్మ ఘన రక్షా నగము నెక్కెనురా

1.    ముందు నాలో పాప-ములు 
    జూడబడెరా డెందము తానన్ని
    టిని నొప్పుకొనెరా-యందుకై
    బలుదుఃఖమాత్మఁజెందెనురా
    సందేహములు వీడు-జాడఁగన్గొనెరా   

2.    సువిశేష బోధనా-చెవులాలించెనురా
    అవివేక శాస్త్రోక్తు-లంటు వీడెనురా 
    నవసత్క్రైస్తవ గోష్ఠి-భువి నా కబ్బెనురా 
    వివిధములగు వేల్పు-ల్విషమైరిగదరా

3.    బాధగురువుల మోము-ల్బహు
    లజ్జఁబడెరా-గాధ మంత్రములన్ని 
    కడగండ్లయి చెడెరా-శోధించి
    నా యాత్మ-శుద్ధి గోరెనురా-సాధించి 
    ప్రభు క్రీస్తు-శరణఁజొచ్చెనురా

4.    మతిలోని లోఁతు మ-ర్మము గానబడెరా 
    మితిలేని ఘన-మే నిండు కొనెరా 
    హితముగా తన జీవ-మిచ్చెక్రీస్తుఁడురా 
    మృతి చేత మన పాప వితతి గొట్టెనురా
5.    కులగోత్రముల బుద్ధి
    కుటిలంబుఁదెగెరా    
    బలవత్పిశాచశృంఖలము విఱిగెనురా 
    సిలువ మోసినవాని -చిర సౌఖ్యోన్నతిరా 
    నెలవుగ నాలోన-నిలచియున్నదిరా   

6.    తనపోల్కెనొరులఁగన్గొనబ్రేమయ్యెనురా 
    మనసు దేవునికి న-ర్పణ సేయఁబడెరా 
    ఘన కృపశాంతులు-గొనెను నెమ్మదిరా 
    మనసు మార్పడి మోక్ష
    మహిమ గన్గొనెరా

No comments:

Post a Comment