Friday, 25 December 2015

కాలము సమీపము

    కాలము సమీపము
    ప్రభుయేసు వచ్చున్‌
    జీతము పొందును నిజదాసుడు 
    ఆనంద మొందెదరు
    ఆనంద మొందెదరు   

1.    బయలుపడు ప్రతి వాని క్రియలు
    కర్ర గడ్డి కొయ్యకాలైనను
    వెండి బంగారము విలువ రాళ్ళైనను
    అగ్నియే తేల్చును (2)            ||కా||

2.    పందెమందు నీకు పాలున్నదా    
    పొందువాడొక్కడే బహుమతిని 
    యోధుడవై మంచి బుద్ధిని కలిగిన 
    వాడబారని(2) కిరీటమొందెదవు   ||కా||

3.    ఆత్మల కొరకై భారమున్నదా
    ఫలితమున్నదా నీ సేవలో
    ప్రభుని రాకలో అందరి ఎదుట 
    ఆనందమహిమ(2)
    కిరీటమొందెదవు                 ||కా||

4.    సంఘము నడిపే సేవకుడా
    మందను నడుపుము ప్రేమతోడ 
    ఆదర్శుండవై మందను కాచిన   
    మహిమ కిరీటం (2) 
    నీవు పొందెదవు               ||కా||

5    మంచి పోరాటము పోరాడుము 
    కాపాడుకొను విశ్వాసమును  
    తన ప్రత్యక్షత నపేక్షించుము
    నీతి కిరీటము (2)నీకివ్వబడును  ||కా||

6.    భక్తితో బ్రతుక గోరినచో
    సిద్ధపడు పొంద హింసలను
    అంతము వరకు నమ్మిక యుంచిన 
    జీవకిరీటము (2) పొందెదవెరుగు ||కా||

7.    దయచేయు శ్రేష్టదీవెనలు
    అంగీకరించు నీ ప్రార్థనలు   
    ప్రార్థనయందు మేల్కొని యుండుము
    స్వర్ణ కిరీటము (2) 
    ధరియింపజేయును          ||కా||

1 comment:

  1. యేసయ్య రాకడ సమీపము. కాబట్టి అందరము సిద్ధంగా ఉందాము.

    ReplyDelete