Friday, 25 December 2015

అన్ని కాలంబుల - నున్న యెహోవా

    అన్ని కాలంబుల - నున్న యెహోవా
    నిన్నెన్నదరంబయో - కన్న తండ్రి 
    వన్నె కెక్కిన మోక్ష - వాసాళి సన్నుతు
    లున్నతమై యుండ - మున్నె నీకు

1    నిన్ను ప్రకటన సేయ నిఖిల 
    లోకములను - బన్నుగ జేసిన 
    బలుడ వీవే - ఉన్న లోకంబుల
    నుడుగక కరుణా సం - పన్నతతో 
    నేలు - ప్రభుడ వీవే
    అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు 
    నున్న సర్వజ్ఞుం - డవు నీవే
    యెన్న శక్యము గాక-ఉన్న లక్షణముల
    సన్నుతించుటకు నే జాలుదునా ||నన్ని||

2     పుట్టింప నీవంచు బోషింప నీవంచు
    గిట్టింప నీవంచు      గీర్తింతును 
    వట్టి పనికి మాలి - నట్టి మానవుల చే 
    పట్టి రక్షింప బా - ధ్యుండవంచు - 
    దట్టమైన కృపను - దరిజేర్చ నాకిచ్చి
    పట్టయి నిలచియుండు - ప్రభుడవంచు
    గట్టడచే గడ - ముట్టుదనుక నా 
    పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు||నన్ని||

3    కారుణ్య నిధి వీవు కఠినాత్ముడను నేను
    భూరి శుద్ధుడవీవు        పాపి నేను
    సార భాగ్యుడవీవు జగతిలో నాకన్న
    దారిద్రుడే లేడు - తరచి చూడ
    సార సద్గుణముల సంపన్నుడవు నీవు 
    ఘోర దుర్గుణ సం - చారి నేను
    ఏ రీతి స్తుతి యింతు నేరీతి సేవింతు 
    నేరమెన్నక ప్రోవ - నెర నమ్మితి

No comments:

Post a Comment