Friday, 25 December 2015

జీవోదయమై జీవము గలిగిన

    జీవోదయమై జీవము గలిగిన
    జీవపు తెరలేచె
    జీవాధిపతి మరణపు తెరలను
    చీల్చివైచి లేచె         ||జీవో||

1  పరమ మందిరము ప్రవేశింపగా 
    తెరచెను మార్గంబు
    పరమ శరీరపు తెర తెరచెను గుడి
    తెర చినిగె నిజంబు          ||జీవో||

2  ధరణియు వణకెను గిరులును గిరగిర 
    తిరిగి బ్రద్దలాయె
    పరమ గురుని మరణ రంగస్థలమున 
    మరణమె మరణించె         ||జీవో||

3  సూర్యుడు అస్త-మించెను నీతి
    సూర్యుడస్తమింప
    సూర్యోదయమిదె మూడవ దినమున 
    జూడ రండి వేగ         ||జీవో||

4  తొలకరి వాన కాలము గాన 
    తెలిసికొనుము లెమ్ము
    వెలుగును పొందుము-కడవరి వర్షా
    కాలమిదే రమ్ము         ||జీవో||

5  కడవరి వర్షా కాలము గనుక
    కనులు తెరచి చూచి
    అడుగుము యేసుని వర్షము కొరకు
    బడయు వరకు వేచి         ||జీవో||

4 comments:

  1. do you have any audio or video version of this?

    ReplyDelete
  2. Hai do you have any audio related this

    ReplyDelete
  3. Who is this song author please?

    ReplyDelete
  4. Thank you so much for sharing

    ReplyDelete