Friday, 25 December 2015

విశ్వాసమే విజయము - విను

విశ్వాసమే విజయము - విను 
    ప్రియుడా య-విశ్వాస మపజయము  
    విశ్వాసాయుతమైన - విసుకని 
    సుకార్యములే - విశ్వాసవంతునికి  
    విజయ మొసగును నిజము   ||విశ్వా||

1.    భక్తుడందువలననే - బ్రతుకును 
    మరియు - శక్తినొంది నిల్చును
    యుక్తముగ వర్తించి - యుర్విని 
    జయించి - ముక్తి నొందున టంచు
    రక్తిగా బాడుదును        ||విశ్వా||

2.    మంచి పేరు నొందును - సాతాను 
    నెదిరించి విజయ మొందును 
    మించిన బాధల్స-హించి జయించును 
    సంచిత మరణము - నానందముగ    
    గాంచు 
                ||విశ్వా||

3.    ప్రవిమల మొందెదము - పాపము 
    నుండి - పరిహరింపబడుదుము   
    అవి రతమును మనము 
    నాశ్చర్యముగ ఘనము
    భువియందున్‌ దివియందున్‌
    బుధులతో నొందుదుము        ||విశ్వా||

4.    నీతిమంతుల మౌదుము 
    నిశ్చయము ప్ర-ఖ్యాతి బోధను నేర్తుము 
    ఆ తండ్రి దత్తముల-నన్ని యార్జించు
    యాతని సుభద్రములో -ననయ
    ముందుము నిజము        ||విశ్వా||

5.    పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న 
    మరి మంచి విశ్వాసమే  
    ధరయందున్‌ బరమందున్‌
    ధన్యాత్మునిగ జేయున్‌ - సరగు 
    నద్దానినే - సంపాదించుము
    ప్రియుడా                  ||విశ్వా||

No comments:

Post a Comment