Friday, 25 December 2015

రాజులకు రాజైన యీ మన విభుని

    రాజులకు రాజైన యీ మన విభుని
    పూజసేయుటకు రండి
    యీ జయశాలి కన్న-మన కింక
    రాజెవ్వరును లేరని    ||రాజులకు||

1    కరుణ గల సోదరుండై-యీయన
    ధరణి కేతెంచె నయ్యా
    తిరముగ నమ్ముకొనిన-మనకొసగు
    బరలోక రాజ్యమ్మును    ||రాజులకు||

2    నక్కలకు బొరియలుండె-నాకాశ
    పక్షులకు గూళ్లుండెను
    ఒక్కింత స్థలమైనను-మన విభుని 
    కెక్కడ లేకుండెను    ||రాజులకు||

3    అపహాసములు సేయుచు-నాయన
    యాననము పై నుమియుచు
    గృప మాలిన సైనికు-లందరును    
    నెపములెంచుచు గొట్టిరి    ||రాజులకు||

4    కరమునందొక్క రెల్లు-పుడకను 
    దిరముగా నునిచి వారల్‌
    ధరణీపతి శ్రేష్ఠుడా-నీకిపుడు
    దండమనుచును మ్రొక్కిరి    ||రాజులకు||

5    ఇట్టి శ్రమలను బొందిన-రక్షకుని
    బట్టుదలతో నమ్మిన  
    అట్టహాసము తోడను-బరలోక 
    పట్టణంబున జేర్చును    ||రాజులకు||

6    శక్తి గల రక్షకుండై-మన కొరకు
    ముక్తి సిద్ధము జేసెను
    భక్తితో బ్రార్థించిన-మన కొసగు
    రక్తితో నా ముక్తిని    ||రాజులకు||

7    త్వరపడి రండి రండి-యీ పరమ 
    గురుని యొద్దకు మీరలు
    దరికి జేరిన వారిని-యీ ప్రభువు
    దరుమడెన్నడు దూరము    ||రాజులకు||

No comments:

Post a Comment