Friday, 25 December 2015

ప్రభువా తరతరములనుండి

1    ప్రభువా తరతరములనుండి
    మాకు నివాస స్థలము నీవే
    యుగయుగములకును నీవే
    మా దేవుడవు,
    దేవుడవు, దేవుడవు, దేవుడవు.

2    పర్వతములు పుట్టకమునుపు
    భూమిని లోకమును నీవు
    పుట్టింపక మునుపు గూడ
    నున్నావు, నున్నావు,
    నున్నావు, నున్నావు         ||ప్రభు||

3    నరపుత్రులను మంటికి మార్చి
    తిరిగి  రండని  సెలవిచ్చెదవు
    వేయి సంవత్సరములు నీకొక  
    జామువలె, జామువలె,    
    జామువలె, జామువలె        ||ప్రభు||

4    నీదు దృష్టికి వేయి యేండ్లు
    గతించిన నిన్నటివలె నున్నవి
    రాత్రియందొక జాముకు సమముగ
    నున్నవి, నున్నవి,
    నున్నవి, నున్నవి            ||ప్రభు||

5    నీవు వారిని పారగొట్టగ
    వరద చేతనైన రీతి
    గడ్డివలె చిగిరించి వాడి
    పోయెదరు, పోయెదరు,
    పోయెదరు, పోయెదరు.    ||ప్రభు||

6    ప్రొద్దుట మొలచి చిగిరించును 
    సాయంత్రమున కోయబడును
    వాడబారును నీ కోపముచే
    క్షీణించున్‌, క్షీణించున్‌,
    క్షీణించున్‌, క్షీణించున్‌     ||ప్రభు||

7    నీదు కోపము వలన మేము
    క్షీణించుచున్నాము దేవా
    నీ ఉగ్రతను బట్టి దిగులు 
    పొందెదము, పొందెదము,
    పొందెదము, పొందెదము  ||ప్రభు||

No comments:

Post a Comment