Friday, 25 December 2015

ఈలాటిదా యేసు ప్రేమ

    ఈలాటిదా యేసు ప్రేమ
    నన్ను - తూలనాడక తనదు
    జాలి జూపినదా             

1.    ఎనలేని పాపకూపమున
    నేను-తనికి మినుకుచును
    నే- దరిఁగానకు డన్‌
    కనికరము ఁబెంచి నాయందు
    వేగఁ గొనిపోవ నా మేలు
    కొరకిందు వచ్చె    ||ఈలాటి||
2.    పెనుగొన్న దుఃఖాబ్దిలోన
    నేను-మునిఁగి కుములుచు నేడు 
    పునగుందునపుడు
    నను నీచుఁడని త్రోయలేక
    తనదు నెనరు నా కగు పరచి
    నీతిఁజూపించె    ||ఈలాటి||

3.    నెమ్మిరవ్వంతైన లేక
    చింత-క్రమ్మి పొగలుచునుండగా 
    నన్నుఁజూచి
    సమ్మతిని ననుఁబ్రోవదలఁచి
    కరముఁజాచి నా-చేయిపట్టి
    చక్కగా బిలిచె    ||ఈలాటి||

4.    పనికిమాలిన వాఁడనైన
    నేను-కనపరచు నాదోష 
    కపటవర్తనము
    మనసు నుంచక తాపపడక
    యింత-ఘనమైన రక్షణ-మును    
    నాకుఁజూపె     ||ఈలాటి||

5.    నా కోర్కెలెల్ల సమయములన్‌
    క్రింది-లోక వాంఛల
    భ్రమసి లొంగెడు వేళన్‌
    చేర్చి దృఢము చిత్తమునన్‌
    శుభము-నాకొసంగెజీవింప
    నా రక్షకుండు    ||ఈలాటి||

6.    శోధనలు ననుఁజుట్టినపుడు
    నీతి-బోధ నా మనసులోఁ
    బుట్టించి పెంచి
    బాధ లెల్లను బాపి మాపి
    యిట్టి యాదరణఁజూపెనా
    యహహ యేమందు    ||ఈలాటి||

No comments:

Post a Comment