Friday, 25 December 2015

నీజల్దరు వృక్షపు నీడలలో

    నీజల్దరు వృక్షపు నీడలలో 
    నే నానందభరితుడనైతిని   
    బలురక్కసి వృక్షపు గాయములు    
    ప్రేమా హస్తములతో తాకు ప్రభు

1.    నా హృదయపు వాకిలి తీయమని
    పలు దినములు మంచులోనిలచితివి
    నీ శిరము వానకు తడిసినను 
    నన్ను రక్షించుటకు వేచితివి     ||నీ||

2.    ఓ ప్రియుడా నా అతి సుందరుడా   
    ధవళ వర్ణుడా నా కతి ప్రియుడా 
    వ్యసనాక్రాంతుడుగా మార్చబడి 
    నీ సొగసును నాకు నొసగితివి   ||నీ||

3.    నీ పరిమళ పుష్ప సుగంధములు
    నా రోత హృదయమును నింపినవి   
    ద్రాక్షారసధారల కన్న మరి
    నీ ప్రేమే ఎంతో అతిమధురం   ||నీ||

4.    ఉన్నత శిఖరములు దాటుచును 
    ఇదిగో అతడొచ్చుచున్నాడు
    నా హృదయపు తలుపులు తెరచుకొని
    నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ||నీ||

5    నీ విందు శాలకు నడిపించి 
    రాజులు యాజకులతో జేర్చితివి 
    జీవాహారము నా కందించి 
    పరమాగీతములను నేర్పితివి   ||నీ||

No comments:

Post a Comment