Friday, 25 December 2015

జీవజల ప్రవాహములు పారుచున్నవి

    జీవజల ప్రవాహములు పారుచున్నవి 
    పరిశుద్ధాత్మ వరములతో సాగుచున్నవి
    యేసుక్రీస్తు నాయకుడై సాగుచున్నవి
    అదే అదే సార్వత్రిక క్రైస్తవ సహవాసము
    హల్లెలూయ పాటలతో 
    అలరారుచున్నది      ||జీవ||

1    దేవుడే దీని శిల్పి యీ భువిలో
    ఆయనే దీనిని నిల్పి
    విశ్వమంత యీ జలములు 
    ప్రవహింపగ జేసెను
    కులము మతము
    భాషాబేధములు లేనిదీ
    అదే అదే సార్వత్రిక క్రైస్తవ సహవాసము
    హల్లెలూయ పాటలతో 
    అలరారుచున్నది    ||జీవ||

2    ఈ నది ఓరన నాటబడిన క్రైస్తవా 
    నెలకు మూడు కాపులుగా 
    విరబూయుమురా
    కలువరిగిరి సిలువ జ్వాలవై
    కొనసాగుమురా
    అదే అదే మార్గము క్రీస్తు జీవమార్గము||జీవ||
3    మరువబోకుమోయి
    మన యేసు ప్రేమను
    కలువరిలో చిందించిన ప్రేమామృతమును
    కడదాక దానిని-విడువబోకుము
    అదే అదే మోక్ష మార్గము
    పరమునకు సాక్షి మార్గము         ||జీవ||

No comments:

Post a Comment