Friday, 25 December 2015

నీ రక్తమే-నీ రక్తమే-నన్‌ శుద్ధీకరించున్‌

    నీ రక్తమే-నీ రక్తమే-నన్‌ శుద్ధీకరించున్‌
    నీ రక్తమే నా బలము 

1    నీ రక్తధారలే యిల
    పాపి కాశ్రయం బిచ్చును
    పరిశుద్ధ తండ్రి పాపిని
    కడిగి పావన పర్చుము     ||నీరక్తమే||

2    నశించు వారికి  నీ సిలువ
    వెఱ్ఱితనముగ నున్నది
    రక్షింపబడుచున్న  పాపికి
    దేవుని శక్తియైయున్నది     ||నీరక్తమే||

3    నీ సిలువలో కార్చినట్టి
    విలువయిన రక్తములోన
    పరమపావన కడుగుము
    పవిత్ర పరచుము పాపిని     ||నీరక్తమే||

4    పందివలె పొర్లిన నన్ను
    కుక్కవలె తిరిగిన నన్ను
    ప్రేమతో చేర్చుకొంటివి
    ప్రేమార్హ నీకె స్తోత్రము     ||నీరక్తమే||

5    నన్‌ వెంబడించు సైతానున్‌
    నన్‌ బెదరించు సైతానున్‌
    దునుమాడేది నీ రక్తమే
    దహించేది నీ రక్తమే     ||నీరక్తమే||

6    స్తుతి మహిమ ఘనతయు
    యుగ యుగంబులకును
    స్తుతి పాత్ర నీకే చెల్లును
    స్తోత్రార్హ నీకెే తగును     ||నీరక్తమే||

1 comment:

  1. Challa Manchin song..heart touching song

    ReplyDelete