Friday, 25 December 2015

నీతో సమమెవరు?

    నీతో సమమెవరు?
    నీలా ప్రేమించేదెవరు?
    నీలా క్షమియించేదెవరు యేసయ్యా?
    నీలా పాపికై ప్రాణంబెట్టిన వారెవరు?

1    లోక బంగారము-ధన ధాన్యాదులు
    ఒక్క పోగేసినా-నీతో సరితూగునా?
    జీవ నదులన్నియు, సర్వ సంద్రములు 
    ఒక్కటై యెగసినా నిన్ను తాకగలవా?
    నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా
    నీవేగా మంచి దేవుడవు         ||నీతో||

2    పలు వేదాలలో మతగ్రంథాలలో
    పాపమే సోకని పరిశుద్ధుడేడి?
    పాప పరిహారార్థం సిలువ మరణమొంది 
    తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు?
    నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి?    
    నీవేగా విమోచకుడవూ         ||నీతో||

3    నేను వెదుకకున్నా నాకు దొరికితివి
    నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
    నీకు గాయాలు చేసి-తరచు రేపితిని
    నన్నెంతో సహించి క్షమియించితివి
    లోక సౌఖ్యాలన్ని ఒక్క చోట కుమ్మరించినా 
    నీవెగా చాలిన దేవుడవు         ||నీతో||

No comments:

Post a Comment