Friday, 25 December 2015

యేసు నాదు కాపరి వాని

    యేసు నాదు కాపరి వాని
    వాసిగా స్తుతించెదన్‌
    యేసు గొఱ్ఱె పిల్లను
    పోయెదను తనవెంట

1    పచ్చిక  పట్లకు - మచ్చికతో నడుపున్‌
    స్వఛ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతిన్‌
    ముందు ముందు వెళ్ళుచు 
    పొందుగ రక్షించు నన్ను
    తన మాధుర్య స్వరంబున
    తనివి దీర్చును      ||యేసు||

2    మరణ లోయ ద్వారా
    సరిగా నడిపించును
    అడవి భయము లెల్ల
    ఎడబాపి రక్షించున్‌
    హత్తి ఒత్తి కట్టి గాయా
    లెంతో ఆదరించును
    వింతగు వాని ప్రేమ సేవలో 
    సంతోషింతును      ||యేసు||

3    శత్రుల ముందాహారం
    సంసిద్ధము జేయును
    నా గిన్నె నిండించి
    పొర్లి పారజేసి
    కడిగి కడిగి శుద్ధిచేసి
    ఆత్మ దాన మిచ్చెను
    వడిగ వాని సాయమున
    జయమున వెళ్ళెదను      ||యేసు||

4 comments: