Friday, 25 December 2015

నరకమనునది-నిరంతముండునయో

1  నరకమనునది-నిరంతముండునయో 
    ఆ ఘోర నరకము-నందు పాపులు 
    బాధపడుదురయో మరియు నగ్ని
    పురుగులందున-కొరుకుచుండును 
    తరుగులేకను ధరణికాదిది దరియుకాదు 
    మరణమెదికిన దొరకదందున                  

2  గప్పుగప్పున రగులుచుండునయ్యో
    ఆ ఘోరనరకము నిప్పులెగయుచు 
    పొంగుచుండునయ్యో
    మబ్బువలె పొగ పైకి లేచును-  
    అబ్బ! అబ్బని యేడ్చుచుందురు 
    బొబ్బలిడుదురు అడ్డమొచ్చెడి
    అబ్బలెవ్వరు కానరందున      ||నరక||

3  నోరు నెత్తి కొట్టుకొందురయ్యో
    ప్రభు యేసు క్రీస్తును
    నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో 
    పురుగు చావదు అగ్ని ఆరదు 
    కొరుకుచుందురు-పండ్లు పటపట 
    తిరిగితిరిగి చూచుచుందురు- 
    పరుగులెత్తక యేడ్చు చుందురు ||నరక||

1 comment: