Friday, 25 December 2015

కర్తా నిన్‌ స్తుతించెదము

కర్తా నిన్‌ స్తుతించెదము
పరిశు...ద్ధ సంఘము పాడి కొనియాడి                  
ఇహ మందెన్నడు కానని ఆశ్చర్య
కార్యముల్‌ మాకై చేసితి వనుచు    ||కర్తా||

1.    సీయోను సంతసించు
    పరమానందము నీకు లభించె గాన
    సీయోను సంతసించు
    రక్షకుడేసుని - మనసార మ్రొక్కి
    పరవశమొందు-ధన్యత నిచ్చిన   ||కర్తా||

2.    కన్నార చూచితిమి - దైవ రక్షణను
    రుచియించి యెరిగితి
    కన్నార చూచితిమి
    లెక్కింపలేని - కృపలతో నిన్ను
    దర్శించి - దీవింప నిశ్చయించిన||కర్తా||

3.     పవిత్ర సంఘమా - యేసు వెదకి
    వెంటాడి స్వంతము చేసిన
    పవిత్ర సంఘమా
    సత్తులేకుండా - పడియున్న నీకు
    రక్తము నిచ్చి - జీవింపజేసిన   ||కర్తా||

4.    అన్యురాలా! సీయోనూ! - నిన్ను
    తృణీకరించక చేతనెత్తికొనె
    అన్యురాలా! సీయోనూ! 
    యేసుని నీతి - ధరింప జేసి పెండ్లి
    కుమార్తె  సౌందర్యమిచ్చిన     ||కర్తా||

5.    శృంగార కన్యలారా! - పరిశు...ద్ధ     
    గానముతో స్తుతించుడి
    శృంగార కన్యలారా!
    సాటి లేని - పెండ్లి కుమారుడేసుని
    మహిమ పరచు-భాగ్యంబు నొసగిన

No comments:

Post a Comment