Friday, 25 December 2015

హృదయమనెడు తలుపు నొద్ద

    హృదయమనెడు తలుపు నొద్ద
    యేసునాథుండు
    నిలచి సదయుడగుచు దట్టుచుండు
    సకల విధములను    ||హృదయ||

1     పరుని బోలి - నిలుచున్నాడు
    పరికించి చూడ - నతడు 
    పరుడు గాడు - రక్షకుండు
    ప్రాణ స్నేహితుడు    ||హృదయ||

2     కరుణా శీలుండతడు గాన
    గాచియున్నాడు
    యేసు కరుణ నెరిగి గారవింప
    గరము న్యాయంబు    ||హృదయ||

3     ఎంతసేపు నిలువ బెట్టి 
    యేడ్పింతురతని
    నాత-డెంతో దయచే
    బిలుచుచున్నాడిప్పుుడు మిమ్ములను   

4     అతడు మిత్రుడతడు
    మిత్రు-డఖిల పాపులకు
    మీర లతని పిలుపు వింటి రేని 
    యతడు-ప్రియుడగును    ||హృదయ||

5    జాలిచేత దన హస్తముల
    జాపియున్నాడు
    మిమ్ము-నాలింగనము సేయగోరి
    యనిశము కనిపెట్టు    ||హృదయ||

6    సాటిలేని దయగల వాడు
    సర్వేశు సుతుడు
    తన-మాట వినెడు
    వారల నెల్ల-సూటిగ రక్షించు ||హృదయ||

7    చేర్చుకొనుడి మీ హృదయమున
    శ్రీ యేసు నాధు
    నతడు - చేర్చు కొనుచు
    మీ కిచ్చును-చిరజీవము గృపను   

8     బ్రతుకు  శాశ్వతంబు కాదు
    పరికించి చూడ
    గాన-బ్రతికియుండు కాలముననే
    ప్రభుని గొలువండి     ||హృదయ||

No comments:

Post a Comment