Friday, 25 December 2015

పరిశుద్ధాత్మను గోరుము

    పరిశుద్ధాత్మను గోరుము
    జీవమ యేసు
    ప్రభుని పేరిట వేడుము
    నరులందరి మీఁద
    నా యాత్మ నుంతునని
    పరలోకపు తండ్రి
    పలికె వేదము నందు          ||పరి||

1    పరిశుద్ధాత్మ లేనిది
    వేదాగమ 
    పఠన పఠనము గాదది 
    నెర చీకటింట సర-కులు
    వెదకు రీతి ప-ల్మరు వెదకినను
    నిరర్థకమైపోవును వేగఁ          ||పరి||

2    పరిశుద్ధాత్మ లేనిది-వర్షము లేని
    పైరు చందంబె యది
    పర బోధకముల వ-ర్తితమైన పనులు 
    జీ-వరహితములై యనుభ 
    వము గానివై యుండుఁ          ||పరి||

3    పరిశుద్ధాత్మ లేనిది
    యేసు ప్రభుని
    నెరుగు టెరుగుట గాదది
    నరరూపుఁదాల్చి
    దు-ర్నరుల రక్షణ కొరకు
    మరణమొందిన ప్రభుని
    కరుణాధికము వడయు          ||పరి||

4    పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని
    బ్రతుకే బ్రతుకు గాదది
    దురితేచ్ఛలను గొప్ప
    యురులం దగిలి భక్తి
    తరిగిపోవుట కద్ది
    దొరకనందున సుమ్మ           ||పరి||

5    పరిశుద్ధాత్మను బొందుట అన్నిటికన్న
    ప్రబలంబైన మేలిట 
    నెరనమ్మి మొరబెట్టు
    పరమపావను డద్ది 
    కరుణించి నీ కొసఁగు
    మరణాంత మగు దనుక          ||పరి||

No comments:

Post a Comment