Friday, 25 December 2015

యేసుని స్వీకరించు

    యేసుని స్వీకరించు
    క్రీస్తేసుని స్వీకరించు
    నీ హృదయపు ద్వారము తెరువుము 
    త్వరితము తానే ప్రవేశించును

1    కనికరముగల దేవుండు
    నిను  వాత్సల్యముతో విమోచించును
    భయంకరమైన పాపము నుండి    
    విడిపింపనిన్ను వెదకివచ్చె       ||యేసు||

2.    మన్నించు సర్వ పాపములన్‌
    తానే మాన్పును సర్వరోగములన్‌
    కృపకనికరముల మకుటము నీకు    
    ధరియింపజేసి ఘనపరచున్‌ ||యేసు||

3    అంధులకు దృష్టి కలుగజేసే
    అంగహీనులను లేపి నడువజేసెన్‌
    పలువిధములగు వ్యాధి గ్రస్తులకు
    స్వస్థత నిచ్చెను తక్షణమే       ||యేసు||

4    పాపపు భారము భరియించెన్‌
    నీ  రోగములన్నిటి తొలగించన్‌   
    సహించెను కొరడా దెబ్బల బాధను 
    జయించెను అన్ని శోధనలన్‌ ||యేసు||

5    కలువరి సిలువలో వ్రేలాడి
    తన రక్తము చిందించె ధారలుగా    
    చేతులలో తన కాళ్లలో చీలలు 
    ముండ్ల కిరీటము ధరియించె ||యేసు||

6.    జీవమిచ్చుటకు ప్రాణమిడె
    మరి జయించెను ప్రతి విధ శోధనలు
    నీ కొరకై మరణించి లేచెను
    శక్తిమంతుడై నిను రక్షింప      ||యేసు||

20 comments:

  1. Thanks for upload this song

    ReplyDelete
  2. Praise the lord

    ReplyDelete
  3. Praise the lord
    Thank

    ReplyDelete
  4. Thank you Jesus for your Love

    ReplyDelete
  5. Super brothers GOD must be glorified

    ReplyDelete
  6. Thank you very much up loaded this Christan songs

    ReplyDelete
  7. My childhood songs

    ReplyDelete
  8. Praise the Lord

    ReplyDelete
  9. Thqs lord 🙏

    ReplyDelete
  10. Thqs Jesus

    ReplyDelete
  11. Thank you for uploading this song. Praise God.

    ReplyDelete
  12. God blesses you bro super song

    ReplyDelete
  13. First verse first line ,kanikaramandhi swaryundu

    ReplyDelete