Friday, 25 December 2015

స్తోత్రము రాజా ఆ...ఆ... స్తోత్రము రాజా

    స్తోత్రము రాజా ఆ...ఆ... స్తోత్రము రాజా
    స్తోత్రము రాజాధి రాజా...

1    స్తోత్రపాత్రుడ పూజ్యనీయుడా
    నిత్యము నాశ్రితుల పాలుడ
    సత్యుడా పరలోక వాసుడ
    నిత్యుడా శ్రీ యేసు నాథుడా   ||స్తోత్ర||

2    ఆకసము నీ మహిమను యిహ
    లోకమందలి సర్వమును
    యేకముగ స్తుతియించుచుండ
    నీ కర్పించెద జిహ్వఫలము    ||స్తోత్ర||

3    యిడుములు కడుసుడుల కైవడి
    వడివడిగను పెనుగొనంగ
    విడువను నెడబాయనంచు
    విజయమిచ్చిన యేసునాథుడా||స్తోత్ర||

4    మరణచ్ఛాయ లోయలోబడి
    తెరవు గానక నరుగువేళ
    పరమ కనికర కరముచే నను
    సరిగ నడిపిన మాదు ప్రభువా ||స్తోత్ర||

5    అరయ నాలో నీదు రూపము
    సరిగ నేర్పడు వరకు నన్ను
    తరచు శ్రమల యనుభవంబున
    పొరల జేసిన యేసునాథుడా  ||స్తోత్ర||

No comments:

Post a Comment