Thursday, 24 December 2015

ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త 

ఆశ్చర్యకరుడు - ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి - బలవంతుడు
లోకాన్ని ప్రేమించి -
 తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన - పునరుధ్ధానుడు
రండి మన హృదయాలను -
ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను -
 ఆరాధించెదము... ఆరాధించెదము

ఆరాధన ఆరాధన - యేసయ్యకే
ఈ ఆరాధన
పరిశుధ్ధుడు పరిశుద్ధుడు -
మన దేవుడు అతిశ్రేష్ఠుడు
రాజులకే రారాజు -
ఆ ప్రభువునే పూజించెదం
హల్లెలుయా హల్లెలుయా -
హల్లెలుయా హల్లెలుయా

సత్య స్వరూపి - సర్వాంతర్యామి
సర్వాధికారి - మంచి కాపరి
వేలాధి సూర్యుల - కాంతిని మించిన
మహిమగలవాడు - మహాదేవుడు
రండి మనమందరము -
ఉత్సహ గానములతో
ఆ దేవా దేవుని - ఆరాధించెదము... ఆరాధించెదము

ఆరాధన....

No comments:

Post a Comment