Thursday, 24 December 2015

లోకానికి ఆనందమే-

లోకానికి ఆనందమే-
ప్రభుయేసు జన్మించెగా
అరుదెంచెను నరరూపిగా-
క్రీస్తు ఈనాడేగా ||2||
మనకు తోడుగా ఇమ్మానుయేలు
లోకరక్షకుడు అభిషేకనాధుడు
సర్వోన్నతమైన స్ధలములలో-
దేవునికే మహిమ ||లోకానికి||
1. చీకటిలోనున్న వారికి -
గొప్ప వెలుగు ఉదయించెను
బంధింపబడిన వారికి -
గొప్ప విడుదల కలిగెను ||2||
నశించుపోవు వారికి -
గొప్ప రక్షణ కలిగెను |2|
సర్వోన్నతమైన స్ధలములలో-
దేవునికే మహిమ ||లోకానికి||
2.యుదాయ బెత్లెహేములో -
యేసుప్రభువుగా పుట్టెను
రాజుల రాజుగా మనలను -
నిత్యము పాలించును||2||
అమితానందము మనకు-
నిత్యజీవము కలిగెను |2|
సర్వోన్నతమైన స్ధలములలో-
దేవునికే మహిమ ||లోకానికి||
https://www.youtube.com/watch?v=oXpjEiN7JvM

No comments:

Post a Comment